Site icon NTV Telugu

Ind vs SA 2nd Test: టాస్ గెలిచిన సఫారీలు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Panth

Panth

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండవ టెస్ట్ నేడు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాంటింగ్ ఎంచుకుంది. గౌహతి వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం. భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడింది. కోల్‌కతా టెస్ట్‌లో దక్షిణాఫ్రికా భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు, సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ ఈ టెస్ట్‌లో గెలవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా ఈ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి 25 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత్ లో టెస్ట్ సిరీస్‌ను గెలవాలని చూస్తోంది. రెండో టెస్ట్ కు ముందు టీం ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. రిషబ్‌ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా కగిసో రబాడా గాయంతో దూరమయ్యాడని ధృవీకరించగా, సైమన్ హార్మర్ భుజం గాయం కారణంగా జట్టులోకి రావడం సందేహాస్పదంగా మారింది.

Also Read:YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్..

ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ప్లేయింగ్ 11లో రెండు మార్పులు చేయగా, దక్షిణాఫ్రికా జట్టు ఒక మార్పు చేసింది. శుభ్‌మాన్ గిల్ స్థానంలో నితీష్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తొలగించి సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు కూడా ఒక మార్పు చేసింది. కార్బిన్ బాష్ స్థానంలో స్పిన్నర్ సెనురాన్ ముత్తుసామి జట్టులోకి వచ్చారు. దీనితో ఆఫ్రికన్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు, ఇప్పటికే కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్ ఉన్నారు.

Also Read:Tejas Fighter Jet: 42 ఏళ్ల భారత్ కల “తేజస్”.. స్వదేశీ యుద్ధ విమాన బలం, కూలడానికి కారణాలు ఇవే..

గౌహతి టెస్టు కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

గౌహతి టెస్టు కోసం దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, సెనురన్ ముత్తుసామి, కేశవ్ మహారాజా

Exit mobile version