NTV Telugu Site icon

IND vs SA: రెండో టీ20.. భారత్ బ్యాటింగ్

Ind Vs Sa

Ind Vs Sa

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది.
గ్వెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గం.కు ప్రారంభం కానుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది. పాట్రిక్ క్రూగర్ స్థానంలో రీజా హెండ్రిక్స్‌ను జట్టులోకి తీసుకుంది. భారత్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి మరింత ఆధిక్యం పొందాలని చూస్తోంది.

Phil Salt: టీ20ల్లో రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్.. ఒకే జట్టుపై..!

భారత్ ప్లేయింగ్ ఎలెవన్:
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేష్ ఖాన్.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్:
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిలే సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కబయోమ్‌జీ పీటర్.

Show comments