NTV Telugu Site icon

IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత్ బ్యాటింగ్

Ind Vs Sa T20 Series

Ind Vs Sa T20 Series

సౌతాఫ్రికా-భారత్‌ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. ఈరోజు మళ్లీ 2024 టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులు తలపడనున్నారు. ఇరు జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు జరుగనుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేయనుంది. డర్బన్ వేదికగా రాత్రి 8.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇటీవల బంగ్లాదేశ్‌పై క్లీన్‌స్వీప్‌ విజయంతో భారత్ మంచి జోరుమీదుంటే.. సొంతగడ్డపై సత్తాచాటేందుకు సఫారీ టీమ్ సై అంటోంది.

Appudo Ippudo Eppudo Review: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ

సౌతాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్:
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిలే సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహారాజ్, నకబయోమ్జి పీటర్.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి.

Show comments