NTV Telugu Site icon

ICC World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌.. స్టార్‌ పేసర్ ఔట్‌! ఇక బ్యాటర్లకు పండగే

South Africa Team

South Africa Team

Nortje Ruled Out Of ICC World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత్‌ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తునాయి. అయితే ఈసారైనా ప్రపంచకప్‌ అందుకుందాం అనుకున్న దక్షిణాఫ్రికాకు టోర్నీకి ముందే భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జ్ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న అన్రిచ్‌.. కోలుకోవడానికి దాదాపు 2 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా అన్రిచ్‌ నోర్జ్ గాయపడ్డాడు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నోర్జేను దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) జొహన్నస్‌బర్గ్‌కు పంపింది. ఈ దాంతో ఆసీస్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. అతడు కోలుకోవడానికి వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. దాంతో ప్రపంచకప్‌లో నోర్జ్ ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్టే. అయితే అతడు మెగా టోర్నీ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని సీఎస్‌ఏ భావిస్తోంది.

Also Read: Violent Tornado: టోర్నడో బీభత్సం.. 10 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు!

ప్రపంచకప్‌ 2023కు ప్రకటించిన 15 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టులో అన్రిచ్‌ నోర్జే ఉన్నాడు. గాయంతో నోర్జే దూరమైతే దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు ప్రపంచకప్‌కి ఎంపికైన మరో పేసర్‌ సిసంద మగల మోకాలి గాయంతో భాదపడుతున్నాడు. అయితే మగల టోర్నీ ఆరంభానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని సమాచారం. ఇక ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో ఆక్టోబర్‌ 7న ఢిల్లీలో తలపడనుంది.