South Africa head coach Shukri Conrad: దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ శుక్రి కాన్రాడ్ భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. టీ20 సిరీస్‌లో రెండు జట్ల మధ్య తేడా చూపించింది హార్దిక్ పాండ్యానేనని ఆయన వ్యాఖ్యానించాడు. సిరీస్‌లో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో 25 బంతుల్లో 63 పరుగులతో అద్భుతంగా ఆడిన హార్దిక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆ మ్యాచ్‌లో హార్దిక్ కీలకమైన డీవాల్డ్ బ్రేవిస్ వికెట్‌ను కూడా పడగొట్టాడు. మూడు ఓవర్లలో 1 వికెట్ తీసి 41 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్ గెలుపు తర్వాత మాట్లాడిన శుక్రి కాన్రాడ్.. జస్ప్రీత్ బుమ్రా మంచి బౌలింగ్ చేసినప్పటికీ.. హార్దిక్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచిందని స్పష్టం చేశాడు.
READ MORE: Johnny Master Case : జానీ మాస్టర్ కేసులో షాకింగ్ ట్విస్ట్..
“నిజంగా చెప్పాలంటే, బుమ్రాను తగ్గించి మాట్లాడటం కాదు కానీ ఈ రెండు జట్ల మధ్య తేడా చూపించింది హార్దిక్ అని నేను భావిస్తున్నాను. ఈ రోజు అతను ఆడిన ఇన్నింగ్స్ వల్లే మేము ఓడిపోయాం. తొలి మ్యాచ్‌లో కూడా అతను వచ్చి మా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ ఫార్మాట్‌లో హార్దిక్ ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్లలో ఒకడిగా ఎందుకు నిలిచాడో దీనివల్లే అర్థమవుతుంది. సిరీస్ మొత్తంలో ప్రదర్శన అద్భుతం. మాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరో నాకు తెలియదు కానీ హార్దిక్ కాకపోతే ఆశ్చర్యమే..” అని కాన్రాడ్ అన్నాడు. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు మాత్రం హార్దిక్‌కు కాకుండా వరుణ్ చక్రవర్తికి దక్కింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 10 వికెట్లు తీసి సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా వరుణ్ నిలిచాడు. మరోవైపు హార్దిక్ ఈ సిరీస్‌లో 142 పరుగులతో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే మూడు వికెట్లు కూడా తీశాడు.
