Sourav Ganguly: క్రికెట్‌లో గౌతమ్ గంభీర్ దూకుడు స్వభావం అందరికీ తెలిసిందే. ఆటగాడిగానే కాదు.. కోచ్‌గానూ గంభీర్ దూకుడు ఉంటాడు. ఈ దూకుడు కొన్ని సార్లు అనుకూలంగా పనిచేసింది. అదే సమయంలో మైదానంలో ఘర్షణలకు సైతం దారితీసింది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సమయంలో విరాట్ కోహ్లీతో ఘర్షణలు జరిగాయి. అయితే.. గంభీర్ దూకుడుపై తాజాగా భారత మాజీ ప్లేయర్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంభీర్ తన ఇంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదని భారత దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించారు. సూచనలు చేస్తూనే గంభీర్ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో నింపిన ఆదర్శాలను గంగూలీ ప్రశంసించారు.
READ MORE: Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ
‘రెవ్‌స్పోర్ట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. గంభీర్‌లోని కొన్ని విషయాలను సమర్థించారు. “గంభీర్ కొంత కఠినంగా ఉండొచ్చు. కానీ పోటీ తత్వం కలిగిన వాడు. గంభీర్ చాలా మంచి మనిషి. ఇంత మొరటుగా లేదా కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. అతడు వ్యక్తికంటే టీమ్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనూ ఇదే వాతావరణాన్ని సృష్టించాడు. గంభీర్ నేతృత్వంలో ఇప్పటికే టీమిండియా రెండు టీ20 వరల్డ్ కప్పులు సొంతం చేసుకుంది. అయితే.. అసలు పరీక్ష ముందు ఉంది. 2027లో సౌతాఫ్రికాతో వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ గంభీర్‌కు అతిపెద్ద సవాల్‌గా మారనుంది. అక్కడి పరిస్థితులు కొంత కఠినంగా ఉంటాయి. అతడిని ఇబ్బందులకు గురి చేస్తాయి. టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే పిచ్‌పై అతిగా ఆలోచించడం మానుకోవాలి. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. స్వదేశంలో స్పిన్‌కు అనుకూలించే టర్నర్ పిచ్‌లపై ఆడాల్సిన అవసరం లేదు. మంచి పిచ్‌లపై ఆడితేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి.” అని సూచించారు.
READ MORE: Realme 16 5G: ‘సెల్ఫీ మిర్రర్’, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. రియల్‌మీ 5G ఫోన్
