Mamata Benerjee: సౌరవ్ గంగూలీని అన్యాయంగా తప్పించారు.. ప్రధానికి మమత విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Benerjee: బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో సారి సౌరవ్ గంగూలీకి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు. గంగూలీ అణచివేతకు గురవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఛైర్మన్‌గా పంపాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. గంగూలీ బెంగాల్‌కు మాత్రమే కాదు యావత్ దేశానికి గర్వకారణమని, అత్యంత ప్రజాదరణ గల వ్యక్తి అని ఆమె కొనియాడారు. టీమిండియా కెప్టెన్‌గా విశేష సేవలందించిన గంగూలీకి అలా అన్యాయం జరగడం తనను షాక్‌క గురి చేసిందన్నారు. గంగూలీ ఏం తప్పు చేశారని ఆయనను పక్కకు పెట్టారని మమత ప్రశ్నించారు.
సౌరవ్ గంగూలీ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మమతా బెనర్జీ కోరారు. బీసీసీఐ పదవి ఇవ్వనప్పుడు ఆయనను ఐసీసీకి పంపితే న్యాయం చేసినట్లువుతుందని సూచించారు. అందుకే ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గంగూలీకి అనుమతి ఇవ్వాలన్నారు. తన విజ్ఞప్తిని ప్రతీకారంగా లేదా రాజకీయంగా తీసుకోవద్దని అభ్యర్థిస్తున్నానన్నారు. క్రికెట్ కోసం, క్రీడల కోసం నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.
Also Read
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
Congress Presidential Poll: ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. గెలిచేది ఆయనేనట!
కోల్‌కతా ఎయిర్ పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సౌరవ్ గంగూలీ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని, ఐసీసీ పదవి కోసం పోటీపడేందుకు గంగూలీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బోర్డు పాలనా పగ్గాలు అందుకోనున్నారు. గంగూలీ వరుసగా రెండో పర్యాయం కూడా అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు మార్గం సుగమం చేసినా, బోర్డులోని ఇతర సభ్యుల నుంచి మద్దతు లేకపోవడంతో ఆ అవకాశం చేజారింది. అయితే తాను బెంగాల్ క్రికెట్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సౌరవ్ గంగూలీ చెప్పాడు.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!