పబ్బులపై మాదాపూర్ పోలీసులు ఆకస్మీక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నలుగురిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్వోటీ డీసీపీ ఎం.ఏ. రషీద్ వివరాలు వెల్లడిస్తూ.. మాదాపూర్ జోన్‌లోని పలు పబ్బుల్లో నిబంధనలను పాటించటం లేదన్న సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు మొత్తం పదహారు పబ్బులపై దాడులు జరిపినట్లు తెలిపారు. హార్ట్‌కప్, బర్డ్ బాక్స్ పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్టు గుర్తించినట్లు ఆయన తెలిపారు.
Also Read : Pakistan Economic Crisis: పాకిస్తాన్ దివాళా తీసింది.. రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
బర్డ్ బాక్స్ పబ్బుకు లైసెన్స్ లేదని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో హార్ట్ కప్ పబ్బు యజమాని ఎం.పవన్ కుమార్, మేనేజర్ ఆదిత్య తమంగ్‌ను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బర్డ్ బాక్స్ పబ్బు యజమాని వంశీవర్ధన్, మేనేజర్ అర్జున్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బుల గురించి తెలిస్తే 94906 17444 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు తెలియచేయాలని డీసీపీ కోరారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఫాంహౌస్‌లపై కూడా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Sonu Sood : దేశంలోనే అతిపెద్ద మండి ప్లేటు.. ఆవిష్కరించిన సోనూసూద్