Site icon NTV Telugu

Government Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఉన్నత విద్యాశాఖలో 3,295 పోస్టుల భర్తీ..!

Hemachandra Reddy

Hemachandra Reddy

Government Jobs: నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఉన్నత విద్యా శాఖలో పోస్టుల భర్తీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 295 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.. అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించింది ఉన్నత విద్యా మండలి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్‌ హేమచంద్రా రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. 18 యూనివర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీ జరుగుతుందని తెలిపారు.

Read ALso: Success Story: ఉద్యోగాన్ని వదిలి.. భూమిని నమ్మాడు.. రూ.కోటి సంపాదిస్తున్నాడు

2009 తర్వాత మొదటి సారి యూనివర్సిటీల్లో నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రొఫెసర్‌ హేమచంద్రా రెడ్డి.. 2018లో నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు కేసులు వల్ల ప్రక్రియ ముందుకు వెళ్లలేదన్న ఆయన.. 18 యూనివర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీ జరుగనుంది.. వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. ఈ డిసెంబర్ నాటికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తాం అని ప్రకటించారు.. ప్రస్తుతం అన్ని యూనివర్సిటీల్లో వెయ్యి మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారని. ప్రపంచానికి ఆదర్శం కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.. యూజీసీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని రెగ్యులర్ చేయలేమన్నారు. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి వారు పని చేసిన కాలానికి 10 శాతం వెయిటేజ్ ఇస్తున్నాం అని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్‌ హేమచంద్రా రెడ్డి.

Exit mobile version