దేశంలో జీఎస్‌టీ సంస్కరణలు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల నుంచి లగ్జరీ కార్ల వరకు పన్నుల భారం భారీగా తగ్గింది. దాంతో కొనుగోలుదారులకు భారీగా సొమ్ము ఆదా అవుతోంది. టెలివిజన్ తయారీదారులు తమ ఉత్పత్తులపై ధరలను తగ్గించాయి. టీవీల మీద కనిష్టంగా రూ.2,500 నుంచి రూ.85,000 వరకు తగ్గాయి. ప్రస్తుతం వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపుతో పాటు దసరా, దీపావళి పండగ సీజన్ ఆఫర్స్ కూడా కలిసిరానున్నాయి.
సోనీ, ఎల్‌జీ వంటి అగ్ర టీవీ బ్రాండ్లు కొత్త ధరల జాబితాను విడుదల చేశాయి. 98 ఇంచెస్ టాప్ ఎండ్ బ్రావియా 5 టీవీ ధర రూ.9 లక్షల నుంచి రూ.8.29 లక్షలకు తగ్గింది. ఈ టీవీపై 71 వేలు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ టీవీపై సోనీ సెంటర్‌లో 31 శాతం తగ్గింపు ఉంది. రూ.5,69,231కి బ్రావియా 5 టీవీ అందుబాటులో ఉంది. అంతేకాదు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఫుల్ పేమెంట్ చేస్తే.. రూ.16500 తక్షణ క్యాష్‌బ్యాక్ మీకు అందుతుంది. దాదాపుగా ఐదున్నర లక్షలకు ఈ టీవీ సొంతం అవుతుంది. ఈ ఆఫర్స్ మళ్లీ మళ్లీ రావు, ఇప్పుడే కొనేసుకుంటే బెట్టర్.
Also Read: IND vs BAN: గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం.. జస్ప్రీత్ బుమ్రా అవుట్!
మరోవైపు 43 అంగుళాల బ్రావియా 2 టీవీ ధర రూ.59,900 నుంచి రూ.54,900కి తగ్గింది. 55 అంగుళాల టీవీ 7 ధర రూ.2.80 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు దిగొచ్చింది. వీటిపై కూడా సోనీ సెంటర్‌లో భారీగా తగ్గింపు ఉంది. అలానే పండగ ఆఫర్స్, బ్యాంకు ఆఫర్స్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025లో కూడా సోనీ బ్రావియా టీవీలపై భారీగా ఆఫర్స్ ఉన్నాయి. ఈ రెండు సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
