NTV Telugu Site icon

Sonu Sood : ఇద్దరు స్టార్ హీరోల గుట్టు రట్టు చేసిన సోనూ సూద్

Sonu Sood On South Film Ind

Sonu Sood On South Film Ind

Sonu Sood : ప్రముఖ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అరుంధతి సినిమాలో పశుపతిగా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయన హీరోగా, విలన్ గా సినిమాలు చేస్తున్నారు. తాజా ద‌ర్శ‌కుడిగా మారి రూపొందించిన సినిమా `ఫ‌తే`. ఈ శ‌నివారం సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి రెండు ట్రైల‌ర్లు విడుద‌ల‌య్యాయి. సోనూ సూద్ త‌న యాక్ష‌న్ ప్యాక్డ్ చిత్రంలో హింసాత్మ‌క‌మైన‌ ఫైట్స్ తో నింపాడ‌ని ట్రైల‌ర్లను చూస్తే అర్థం అవుతుంది. ఫ‌తే చిత్రం ర‌క్త‌పాతం హింస‌లో `యానిమ‌ల్ కా బాప్` అని నిరూపించ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్ 2 రివీల్ చేసింది. ప్రస్తుతం త‌న సినిమాని ప్ర‌మోట్ చేస్తున్న సోనూసూద్ తాను గ‌తంలో క‌లిసి ప‌ని చేసిన ఇద్దరు ఖాన్ ల గుట్టు రట్టు చేశాడు. స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ త‌న చుట్టూ ఉన్న వారి విష‌యంలో ఎలా ఉంటారో సోనూసూద్ చెప్పిన విష‌యాలు నిజంగా ఆసక్తికరంగా ఉన్నాయి. 2010లో సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ `దబాంగ్`లో విలన్‌గా నటించిన సోను సూద్, 2014 లో `హ్యాపీ న్యూ ఇయర్`లో షారుఖ్ ఖాన్ కు ఫ్రెండ్ గా నటించారు.

Read Also:Jyothula Nehru: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌ ఇంటర్వ్యూలో సోనూ సూద్ మాట్లాడుతూ.. ఆ ఇద్దరు సూపర్‌స్టార్‌లతో కలిసి పనిచేసినప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఇద్ద‌రు ఖాన్ ల‌తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉండేదన్నారు.. కానీ షారుఖ్ ఖాన్‌తో పని మరింత ఆసక్తికరంగా ఉంటుంద‌ని అన్నాడు. లండ‌న్, అమెరికాకు చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్లామ‌ని, సుదీర్ఘ ప్ర‌యాణంలో స‌ర‌దాగా గ‌డిచిపోయింద‌ని సోనూ సూద్ అన్నారు. ప్రయాణాల సమయంలో షారూఖ్ తో సన్నిహితంగా ఉండే అవకాశం క‌లిగింద‌న్నారు.

Read Also:PM Shram Yogi Maandhan Yojana: ఈ స్కీమ్ లో చేరితే.. ప్రతి నెల రూ. 3 వేలు పొందే ఛాన్స్!

సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ… అంత‌గా త‌న భావాల‌ను వ్యక్తపరచని వ్యక్తి అన్నారు. ఇత‌రుల విష‌యంలో ఎంతో శ్రద్ధగలవాడన్నారు. సల్మాన్ ఖాన్ తనను తాను వ్యక్తపరిచే విష‌యంలో మంచివాడు కాదు కానీ ఎవరినైనా ఇష్టపడితే వారిని మ‌నస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. అత‌డి శ్రద్ధ ఎదుటి వ్య‌క్తికి తెలిసిపోతుంది.. అని సోనూ సూద్ అన్నాడు. ఇరువురి మ‌ధ్యా వైరుధ్యాలున్నా కానీ, ఖాన్ ల‌ మధ్య ఒక ఉమ్మడి లక్షణాన్ని గుర్తించానని సోనూ చెప్పారు. సోనూ సూద్ తెలిపాడు. అన్ని విజయాలు ఉన్నా కానీ..వారి చుట్టూ ఉన్న వ్యక్తులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో వారికి తెలుసన్నారు.

Show comments