తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సందేశం ఇచ్చారు. ప్రియమైన సోదర సోదరీమణులారా.. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా.. కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారని వీడియో సందేశంలో తెలిపారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నాని అన్నారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దొరల తెలంగాణని.. ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలని పేర్కొన్నారు.
Read Also: CM YS Jagan: కాలుష్యరహిత విద్యుత్ రాష్ట్రానికి మేలు చేస్తుంది: సీఎం జగన్
మీ కలలు సహకారం అవ్వాలి.. మీకు మంచి ప్రభుత్వం లభించాలని సోనియా గాంధీ కోరారు. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు.. ఈ ప్రేమ, అభిమానాలకు నేను ఎప్పటికి మీకు రుణపడి ఉంటానని తెలిపారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు నా విన్నపం.. మార్పు కోసం కాంగ్రెస్ కి ఓటేయండి.. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని సోనియా గాంధీ వీడియోలో చెప్పారు.
Read Also: Vivek Venkataswamy: కేటీఆర్ ఒక బచ్చ.. కాకా కృషిపై సోయి లేక మాట్లాడుతుండు
