Congress: భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిసిందంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం కావడంతో ఆ పార్టీ ఆదివారం నాడు స్పష్టత ఇచ్చింది. సోనియాగాంధీ రిటైర్ కావడం లేదని, పార్టీకి ఆమె ఆశీస్సులు, మార్గదర్శకత్వం కొనసాగుతాయని పార్టీ అధికారి ప్రతినిధి అల్కా లంబా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో శనివారంనాడు జరిగిన ప్లీనరీ సమావేశంలో సోనియాగాంధీ ప్రసంగిస్తూ, భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో తన ఇన్సింగ్స్ ముగిసిందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆమె క్రియాశీలక రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీనిపై ప్లీనరీ వేదికగానే అల్కా లంబా ఆదివారం నాడు స్పష్టత ఇచ్చారు.
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంకా రాజకీయాల నుండి రిటైర్ కావడం లేదని అల్కా లాంబా ఆదివారం అన్నారు. తాను రాజకీయాల నుండి రిటైర్ కావడం లేదని, మార్గదర్శక శక్తిగా కొనసాగుతానని సోనియా గాంధీ స్పష్టం చేశారని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశానికి హాజరైన సోనియా గాంధీ సమ్మతితో నవ్వుతూ కనిపించారు. ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అల్కా లంబా చెప్పారు. మీడియా కూడా ఈ విషయాన్ని గమనించాలని, సోనియగాంధీ ప్రసంగాన్ని తప్పుగా అర్ధం చేసుకోవద్దని కోరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో సోనియాగాంధీ కొనసాగుతారని మరోసారి స్పష్టత ఇచ్చారు.
Read Also: Drag Horror: లారీ బీభత్సం.. స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లడంతో తాత, మనవడు మృతి
సోనియాగాంధీ తన ప్రసంగంలో 2004,2009 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలు, డాక్టర్ మన్మోహన్ సింగ్ సమర్ధ నాయకత్వం తనకెంతో సంతృప్తి కలిగించాయని, రాహుల్ సారథ్యంలోని భారత్ జోడో యాత్ర ముగింపుతో నా ఇన్నింగ్స్ ముగియడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. సీనియర్లు, యువతను కలుపుకొని ముందుకు వెళ్లాలంటూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు దిశానిర్దేశం చేశారు.
