Sonia Gandhi: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియాగాంధీ మరోసారి కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఎంపికయ్యారు. 2024, జూన్ 8వ తేదీ శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, శశి థరూర్, అజయ్ మాకెన్, కార్తీ చిదంబరం, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇది కూడా చదవండి: NTR : ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్..?
Also Read
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
మొదట ఆమె పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ తర్వాత నేతలు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, కె సుధాకరన్ ప్రతిపాదించగా.. ఎంపీలు సమర్థించి తీర్మానం చేశారు. ఇదిలా ఉంటే శనివారం ఉదయం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ICMR: సాధారణ ఉప్పు కంటే రాతి ఉప్పు ఆరోగ్యకరమైనదా?.. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ఏం చెప్తున్నాయంటే?
ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించింది. 99 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఇండియా కూటమి కూడా మెరుగైన సీట్లు సాధించింది. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీని ఎంపికయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్‌ను స్పీకర్ ప్రతిపక్ష నేతగా ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!