Sonali Phogat Case: బీజేపీ నేత, టిక్‌టిక్ స్టార్, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఆమెను హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. హత్యకు రూ.10 కోట్ల డీల్ కుదిరిందని, ఈ మేరకు తమ కుటుంబానికి ఇటీవలే రెండు లేఖలు అందాయని ఆమె బావ అమన్ పూనియా తాజాగా చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ రెండు లేఖలు వచ్చినట్లు తెలిపారు. ఒక లేఖలో రూ.10 కోట్ల డీల్ గురించి, మరో లేఖలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయన్నారు. ఈ లేఖల్లో ముఖ్యమైన సమాచారం ఉండటంతో వీటిపై దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Amit Shah: ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక క్రమశిక్షణ అవసరం
సోనాలీ ఫోగాట్ ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ, ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలింది. విచారణ చేపట్టిన పోలీసులు సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ సమయంలో సోనాలీ మరణంపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె కుటుంబసభ్యులు.. ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించారు. ప్రస్తుతం సీబీఐ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.