Telangana: ఆస్తి కోసం నవ మాసాలు పెంచి పెద్దచేసిన కన్న తల్లినే ఇంటి నుంచి గెంటివేసిన నిజామాబాద్‌లో జరిగింది.. చేసేదేమీ లేక ఆ తల్లి చెట్టుకింది దీనంగా కూర్చొని కన్నీరు కారుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే దోమకొండ మండలం సoగమేశ్వర కాలనీలో దారుణం జరిగింది.. ఆస్తి వివాదంలో తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు కుమారుడు.. భూమి పంపకం విషయంలో ఇద్దరు కొడుకుల మధ్య వివాదం నడుస్తోంది.. ఘర్షణ కూడా జరిగింది.. అదే తల్లిపాలిక శాపంగా మారింది.. కుమారులు విడివిడిగా ఉంటున్నా.. ఇప్పుడు తల్లికి కేటాయించిన ఇంటికి తాళం వేసేశారు.. చేతగాని సమయంలో ఆసరా ఉండాల్సినే కుమారుడే కర్కషంగా వ్యవహించారు.. ఆస్తి వివాదంలో కన్న తల్లిపై ప్రతాపం చూవారు.. దీంతో.. చేసేదీ ఏమీ లేక.. చెట్టు కింద దిగాలుగా కూర్చుండిపోయింది తల్లి లచ్చవ్వ.. భూమి పంపకం విషయంలో ఇద్దరు కొడుకుల మధ్య గొడవ జరిగింది.. చివరకు నాపై వారి కోపాన్ని చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది లచ్చవ్వ..
Read Also: Petrol and Diesel Price: తగ్గిన ముడి చమురు ధరలు.. భారత్‌లో మారిన పెట్రో ధరలు