Son In Law Protest: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టిన సంఘటనలు చూశాం. మెట్టినింటి వారి ఇబ్బందులు తాళలేక కోడళ్లు అత్తగారింటి ఎదుట ధర్నా చేసిన వార్తలు చదివాం కానీ.. అల్లుడు అత్తగారింటి ఎదుట ధర్నా చేసిన విచిత్ర ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు తనను వేధిస్తున్నారంటూ అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగిన ఘటన కోదాడలో జరిగింది.
Read Also: Samantha: చైతన్యతో విడాకులు.. ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నా
ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణీ ఇద్దరు దంపతులు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా వారు విడివిడిగా దూరంగా ఉంటున్నారు. బాబుని తల్లిదండ్రుల చెంతనే ఉంచి పృథ్వీ రమణీ కెనడా వెళ్లింది. వారం వారం కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న ప్రవీణ్.. తన కొడుకును చూడకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ప్రవీణ్.. తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగాడు.
Read Also: Minister Mallareddy: హే.. మంత్రి మల్లారెడ్డి మళ్లీ వేసేశారుగా..