NTV Telugu Site icon

Son Kills Parents: కొడుకు కాదు కర్కోటకుడు.. తల్లి ఒంటిపై బంగారం కోసం తల్లిదండ్రులను చంపేశాడు..

Crime

Crime

Son Kills Parents: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. జల్సాలకు అలవాటుపడి తల్లి ఒంటిపై బంగారం కోసం తల్లిదండ్రులను హతమార్చాడు ఓ కసాయి కొడుకు. గత నెల 22న ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన 25 రోజుల తర్వాత ఈ కేసులో మిస్టరీ వీడింది. అత్తమామల హత్యకు కోడలు కూడా సహకరించింది. గత నెల 22న నర్సాపూర్ రాయరావు చెరువు వద్ద జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుళ్లనగర్‌కి చెందిన కిష్టయ్య, నర్సమ్మగా గుర్తించారు. కిష్టయ్య, నర్సమ్మల కొడుకు లక్ష్మణ్ దుండిగల్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసై లక్ష్మణ్ అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చడానికి తల్లి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసుపై కన్నేశాడు. గత నెలలో తల్లిదండ్రులను ఆ కుమారుడు ఇంటికి పిలిచాడు. ఇంట్లో తల్లిదండ్రులు నిద్రిస్తుండగా తల్లి గొంతునులిమి చంపేశాడు కసాయి కొడుకు లక్ష్మణ్. కాసేపటికే తండ్రి నిద్రలేచి చూడటంతో తండ్రిని కూడా చంపేశాడు ఆ కిరాతకుడు. భార్య సహాయంతో కారులో నర్సాపూర్ అడవుల్లో మృతదేహాలను తీసుకువచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టి జంట పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: Crime News: అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులు.. యువకుడు అరెస్ట్