ఓ అల్లుడు అత్తింటికే కన్నం వేశాడు. అత్త ఇంట్లో అల్లుడు చోరీ చేశాడు. ఆమె ఇంట్లో లేని సమయం చూసి దొంగతనానికి పాల్పడ్డాడు. అందినకాడికి దోచుకెళ్లాడు. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రోటరీ నగర్ కు చెందిన సంతోష్ వాళ్ల అత్త ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన అల్లుడు సంతోష్ చోరీకి పాల్పడ్డాడు.
Also Read:CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్!
ఇంట్లో ఉంచిన 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఊరినుంచి తిరిగొచ్చిన అత్తకు షాక్ తగిలింది. ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నాలుగో టౌన్ పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.