Tirupati: తిరుపతి జిల్లా వెంకటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య కోసం అత్తింటికి వెళ్లిన అల్లుడిపై మామ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వివరాల ప్రకారం.. పాపన హరిప్రసాద్ (32), లక్ష్మీ మౌనిక దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య లక్ష్మీ మౌనిక అలిగి పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో భార్య, పిల్లలను తీసుకెళ్లేందుకు హరిప్రసాద్ శుక్రవారం అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మాటా మాటా పెరిగింది. ఈ సమయంలో మామ తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు వెంటనే హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శరీరం సుమారు 70 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Tirupati: పెళ్లాం కోసం అత్తింటికి వెళితే.. అల్లుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన మామ..

Fire