NTV Telugu Site icon

Crime: ఆస్తి కోసం కన్న తండ్రినే కడతేర్చిన కొడుకు, కూతురు, అల్లుడు..

Medak

Medak

మెదక్ జిల్లాలోని చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిని చంపేసి సహజ మరణంగా కొడుకు, కూతురు, అల్లుడు చిత్రీకరించారు. కాగా, మృతుడి భార్య లచ్చవ్వ ఫిర్యాదుతో ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2022 జూలై 16న అర్థరాత్రి తండ్రి కిష్టయ్యని ఇంట్లో తలగడ ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చంపేసిన కొడుకు స్వామి, కూతురు రేణుక, అల్లుడు అశోక్ లపై పోలీసులకు లచ్చవ్వ కంప్లైంట్ చేసింది. ఇక, గ్రామస్తులు కిష్టయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేయగా సహజ మరణంగా చిత్రీకరించిన వైనం నెలకొంది.

Read Also: US- Somalia Conflict: సోమాలియాపై అమెరికా వైమానిక దాడి.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అయితే, కిష్టయ్యని హత్య చేసిన కొన్ని రోజులకు అల్లుడు సైతం చనిపోయాడు. ఇక, కొడుకు స్వామి తన తండ్రి పేరు మీద ఉన్న భూమిని పట్టా చేసుకున్నాడు. కొడుకు, కూతురు వ్యవహారశైలిపై అనుమానంతో పోలీసులకు తల్లి లచ్చవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని కిష్టయ్య శవాన్ని పాతి పెట్టిన చోట నుంచి గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్య బృందంతో పోలీసులు రీ- పోస్టుమార్టం నిర్వహించారు. ఇక, రిపోర్టు ఆధారంగా కుటుంబ సభ్యులని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో కొడుకు స్వామి, కూతురు రేణుకను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.