NTV Telugu Site icon

Broke Bottle Head : ‘సల్మాన్ ఖాన్ నా తలపై బాటిల్ పగులగొట్టాడు’.. ప్రియురాలు సోమి అలీ

Salman

Salman

Broke Bottle Head : దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాలను ఏలుతున్నాడు సల్మాన్ ఖాన్. అయినా ఇప్పటికీ బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ క్రేజ్ నేటికీ అలాగే ఉంది. సల్మాన్ ప్రేమాయణంలో చాలామంది హీరోయిన్ల లిస్టే ఉంది. నిత్యం సల్మాన్ వివాదాలు, ప్రేమ జీవితం గురించి ఇప్పటికీ చాలా వార్తలు చర్చనీయాంశంగానే ఉంటున్నాయి. సల్మాన్ తో ప్రేమలో పడిన హీరోయిన్లంతా వారి భాగస్వాములను వెతుక్కుని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యారు. కానీ ఇప్పటికీ అందరి అభిమాన భాయిజాన్ బ్యాచిలరే.

తాజాగా సల్మాన్ ఖాన్ వ్యవహారాలపై అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ మాజీ ప్రేయసి సోమి అలీ సల్మాన్ గురించి షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. సోమి, సల్మాన్ 1993లో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.. వారు కొన్ని రోజుల తర్వాత విడిపోయారు. దీని వెనుక సల్మాన్ దురుసు ప్రవర్తనే ప్రధాన కారణమని తేలింది.

Read Also: Kala Venkatrao: తిరుమలలో అద్దె గదుల రేట్లను భారీగా పెంచడం దుర్మార్గం

సోమి అలీ తన సోషల్ మీడియాలో విభిన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఇంటర్వ్యూను పంచుకున్నారు. చిన్నతనంలో తాను అనుభవించిన వేధింపుల గురించి, ఆ తర్వాత సల్మాన్‌తో ఉన్నప్పుడు తాను అనుభవించిన వేధింపులపై ఆమె వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సల్మాన్ తనకు సిగరెట్ ఇస్తానని, లైంగికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిపై గతంలో సోమీ వ్యాఖ్యానించగా.. సల్మాన్ ఆమె తలపై బాటిల్ పగలకొట్టిన ఘటనపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను సోమీ పోస్ట్‌లో తెలిపారు.

దీని గురించి సోమీ మాట్లాడుతూ, “అతను నా తలపై ఉన్న బాటిల్‌ను పగలగొట్టాడు.. అప్పుడు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అతను నా తలపై ఒక గ్లాసు ఆల్కాహాల్ కలిపిన కూల్ డ్రింక్ పోశాడు.. ఇలా ఒక్కసారి కాదు.. చాలా సార్లు జరిగింది. ఆ సమయంలో నాతో ఓ ఫ్రెండ్ కూడా ఉంది. ఆమె ఇదంతా చూసింది.. ప్రస్తుతం తన పేరు నేను చెప్పలేను.. కానీ అలా నా తలపై సల్మాన్ ఖాన్ చేయడం తప్పు’.

Read Also: Suryakumar Yadav: సూర్యకుమార్ అదిరిపోయే రికార్డు.. టీ20 హిస్టరీలోనే తొలి ఆటగాడు

సల్మాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు, సోమీ దారుణాలను భరించింది. దీనిపై ఒక్కసారి కాదు అనేక సార్లు ఆమె బహిరంగంగానే వ్యాఖ్యానించింది. సల్మాన్ తనకి ఏం చేశాడో ఇంకా మరచిపోలేదని.. ఈ రోజుకు ఆ ఆలోచనలే తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించింది.

Show comments