NTV Telugu Site icon

Somu Veerraju : జనసేనతో పొత్తు.. కీలక వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు

Somu Veerraju

Somu Veerraju

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజుకు మలుపు తీసుకుంటున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం వేడెక్కింది. అదే సమయంలో బీజేపీ పొత్తు గురించి కూడా వ్యాఖ్యానించారు పవన్‌ కల్యాణ్‌. దీంతో బీజేపీతో జనసేన పొత్తుపై విభిన్నంగా వార్తలు వెలువడ్డాయి. అయితే.. దీనిపై జనసేన అధినేతతో పాటు ఆ పార్టీ నేతలు సైతం బీజేపీతో పొత్త కొనసాగుతుందంటూ వివరణ ఇచ్చారు. అయితే.. నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మరోసారి జనసేన-బీజేపీ పొత్తను కొనసాగించలేమని వార్తలు రావడంతో దీనిపై సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు.
Also Read : Winter Tips : చలికాలంలో జలుబు తగ్గేదెలా?.. ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

తాజాగా ఆయన అమరావతిలో మాట్లాడుతూ.. జనసేనతో మా పొత్తు కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. జనసేనతో పొత్తు.. జనంతో పొత్తు పెట్టుకుంటామన్నారు. జనసేనతో దూరం పాటించాలని నేను అన్నట్టుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదని, ఇలా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ విషయాన్ని తాను ఖండిస్తున్నట్లు వెల్లడించారు సోము వీర్రాజు.