NTV Telugu Site icon

Somu Veerraju: మాజీ అధ్యక్షుడి పోటీపై క్లారిటీ.. మంగళవారం అధికారిక ప్రకటన!

Somu

Somu

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీకి 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన మంగళవారం ఉదయం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమాశంలో రాష్ట్రంలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర నేతలంతా పాల్గొననున్నారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇక బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అది రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి అర్బన్ నుంచి.. ఏదో ఒక స్థానాన్ని కోరాలని బీజేపీ భావిస్తోంది. ఈ విషయంపై మంగళవారం క్లారిటీ రానుంది.

ఇక మంగళవారం జరిగే సమావేశంలో బీజేపీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శలు, జాతీయ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్న ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ స్థానాలు, అభ్యర్థుల ఎంపిక పూర్తికాగానే లిస్టు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలు..
విజయవాడ-వెస్ట్, బద్వేల్, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్, ఆదోని, పాడేరు, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారు. ఇక అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాలను కూడా కోరుతున్నారు. అంతేకాకుండా అదనంగా రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని కూడా బీజేపీ కోరుతోంది.

రాజంపేట లోక్‌సభ పరిధిలో మొత్తం క్షత్రియ సామాజిక వర్గానికి సుమారు లక్ష ఓట్లు ఉన్నాయి. క్షత్రియ సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయాలంటే రాజులకే (క్షత్రియులు) సీటు ఇవ్వాలని డిమాండ్ ఉంది. టీడీపీ నుంచి అయితే జగన్మోహన్ రాజు, బీజేపీ నుంచి అయితే చెంగల్ రాజు‌కు టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. ఇక
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం లేదా రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయాలని ప్రతిపాదన ఉంది. ఈ రెండింటిలో ఏది లభించినా అక్కడ సోము వీర్రాజును బరిలోకి దింపాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.