NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను.. బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి..!

Kakani

Kakani

Bangalore rave party: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించిన పలు ఆరోపణలు చేశారు.. నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని.. నా పాస్ పోర్ట్ దొరికిందని.. గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని చెప్పారు.. దీనిపై నేను సోమిరెడ్డికి సవాల్ విసిరాను.. బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశా.. నా పాస్ పోర్ట్ కార్లో దొరికిందని చెప్పారు.. నా పాస్ పోర్ట్ నా దగ్గర ఉంది అని ఆయన పేర్కొన్నారు. కారులో దొరికిందని చెబుతున్న పాస్ పోర్టు ఎవరి దగ్గర ఉంది.. సోమిరెడ్డి దగ్గర ఉందా.. కర్ణాటక పోలీసుల వద్ద ఉందా అని ప్రశ్నించారు. దీనికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే సమాధానం చెప్పాలి అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అడిగారు.

Read Also: Prashanth Neel : ఆ హీరో ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇవ్వనున్న ప్రశాంత్ నీల్..?

ఆ కారుతో నాకున్న సంబంధాలను రుజువు చేయమని కోరాను అని కాకాణి తెలిపారు. కారు తుమ్మల వెంకటేశ్వర రావు పేరుతో ఉంది.. కారుకు స్టికర్ ఉందని చెప్పి నా కారు అని చెప్పారు.. స్టికర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశా.. వారు విచారణ చేస్తున్నారు.. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి నాకు తెలియదు.. నాతో గోపాల్ రెడ్డికి పరిచయం ఉన్నట్టు ఏ ఆధారం ఉన్నా సోమిరెడ్డి బయట పెట్టాలి.. గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి పార్టీకి సంబంధం లేదని కర్ణాటక పోలీసులు స్పష్టం చేశారు అనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కానీ సోమిరెడ్డి మాత్రం ఈ పార్టీని నాకు అంట కడుతున్నారు.. క్లబ్ కు వెళ్లడం, పేకాట ఆడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందాం అని సవాల్ చేశారు. బ్లడ్ శ్యాంపిల్స్ ఇచ్చేందుకు నేను సిద్ధం.. నెల్లూరులో ఉంటా, దమ్ముంటే సోమిరెడ్డి రావాలి అని కాకాణి గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read Also: Rajasthan: బైక్‌పై రొమాన్స్.. స్టేషన్ తీసుకెళ్లి ఆ పని చేయించిన పోలీసులు

ఇక, సోమిరెడ్డి క్యారక్టర్ పై స్థానిక పత్రికలో వార్తలు వచ్చాయని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. దానిపై అప్పట్లో ఆయన ఖండించలేదు.. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలా ఉన్నాయి.. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారు.. సోమిరెడ్డిపై నేను చేస్తున్న ఆరోపణలు అన్నీ నిజమే.. రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేయడం సరికాదు.. కోర్టులో దొంగతనంపై నాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.. ఏ విచారణ కైనా నేను సిద్ధంగా ఉన్నాను అని కాకాణి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు.

Show comments