ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. రాబోయే కాలంలో వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు పరాకాష్ట అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ చేసిన అరాచకాలు..దుర్మార్గాలకు విద్యావంతులు తగిన బుద్ది చెప్పారు. అన్ని పార్టీలు కలిసి వచ్చాయి.. మేము ఒక్కరే అని సజ్జల అంటున్నాడు..టీడీపీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందుకే అందరూ మాతో ఉన్నారు..వైసీపీ నాయకుల మాటలు విని దారుణాలకు పాల్పడిన పోలీసు అధికారులను వదిలిపెట్టం అన్నారు సోమిరెడ్డి.
Read Also: IND vs AUS 2nd ODI: టీమిండియా ఘోర పరాజయం.. లక్ష్యాన్ని ఓపెనర్లే కొట్టేశారు
ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు పరాకాష్ట అన్నారు. ఏ పార్టీలు.మాతో వచ్చినా కలుపుకుంటాం.అందరితో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.మంత్రి కాకాణి, వై.సి.పి. ఎం. ఎల్.సి. అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డిల మధ్య డబ్బుల విషయంలో సజ్జల జోక్యం చేసుకున్నారు.అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రి కాకాణి దూరంగా ఉన్నాడన్నారు.
Read Also: Crime News: కన్నతల్లిని చంపి ఐదు ముక్కలు చేసిన కూతురు.. రెండు నెలలుగా ఇంట్లోనే