టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయా? అంటే అవునంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో పోలీసులు అతి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ నుండి టీడీపీ లోకి కొంతమంది యువకులు చేరుతున్నారన్న సమాచారంతో పోలీసుల చేత భయభ్రాంతులకు గురి చేసేందుకు వైసీపీ నాయకులు. ప్రయత్నం చేశారన్నారు. వెంకటాచలం మండలం లోని వైసిపి లో ఉన్న యువకులు టిడిపిలో చేరేందుకు వెంకటాచల మండల కేంద్రం కు వస్తుండగా హైవే పై పోలీసులు ఓవరాక్షన్ చేసి పోలీసు వాహనాలను అడ్డుపెట్టి యువకుల ద్విచక్ర వాహనాలను ఆపి తాళాలను తీసుకోవడంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.
Read Also:Thurs Day Sai Baba Special Pooja Live: గురువారం శ్రీసాయి చాలీసా వింటే..
సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి సోమిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పార్టీ కార్యాలయం చేరుకొని దాదాపు 50 మంది యువకులకు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని పార్టీలోకి చేరేందుకు వస్తున్న యువకులను నిలిపి వారి వాహనాల తాళాలను తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు ఏమి చేసినా పట్టించుకోని పోలీసులు ఇక్కడ ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు అని విమర్శించారు.
అసలేం జరిగిందంటే..
బుధవారం వైసీపీకి చెందిన ఓ యువనేత టీడీపీలో చేరేందుకు తన మద్దతుదారులతో కలిసి బైక్‌లపై టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్నారు. అయితే.. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఏకంగా జాతీయ రహదారిపై పోలీసు వాహనాలను అడ్డుగా పెట్టి బైక్‌లను ఆపి, తాళాలను లాక్కొని పక్కనే ఉన్న చెట్లలో పడేశారు. పోలీసుల చర్యల వెనుక మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదేశాలు వున్నాయని సోమిరెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం పంచాయతీ వడ్డిపాళెం గ్రామంలో వైసీపీకి చెందిన యువనేత యనమల రాజేంద్ర టీడీపీలో చేరేందుకు బుధవారం ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
ఉదయం తన మద్దతుదారులతో కలిసి వెంకటాచలంలోని టీడీపీ కార్యాలయానికి రావడానికి రెడీ అయ్యారు. దీంతో సీఐ గంగాధర్, ఎస్‌ఐ అయ్యప్పలు గొలగమూడి వద్ద జాతీయ రహదారికి అడ్డంగా తమ వాహనాలను ఉంచి వారిని అడ్డుకున్నారు. యువకుల బైక్‌ల తాళాలను లాక్కొని పక్కనే ఉన్న చెట్లలో పడేశారు. పోలీసులకు యువతకు మధ్య కాసేపు వాదోపవాదాలు పెరిగి ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్కడకు చేరుకుని పోలీసులతో వాదనకు దిగారు.
అయినప్పటికీ బైక్‌లను వదిలిపెట్టకపోవడంతో పోలీసుల తీరుకు నిరసనగా సర్వేపల్లి క్రాస్ రోడ్డు నుంచి టీడీపీ కార్యాలయం వరకు యువతతో కలిసి సోమిరెడ్డి పాదయాత్ర చేశారు. తమను లాఠీలతో కొట్టారని యువకులు చెప్పడంతో సోమిరెడ్డి మళ్లీ సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్దకు వెళ్లి సీఐని దీనిపై ప్రశ్నించారు. చివరకు వెంకటాచలంలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని యనమల రాజేంద్ర తన సన్నిహితులతో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో నెల్లూరు రాజకీయం వేడెక్కింది.
Read Also: CM KCR: నేడే మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ టూర్.. కొనసాగుతున్న అరెస్టుల పర్వం
