Site icon NTV Telugu

Somireddy Chandramohan Reddy: మంత్రి కాకాణికి శిక్ష తప్పదు

Somireddy Chandra Mohan Reddy

Somireddy Chandra Mohan Reddy

ఏపీలో నెల్లూరు జిల్లా హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నెల్లూరు కోర్టులో చోరీ కేసుకి సంబంధించి సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ అధికారులు ఈ కేసులో విచారణ ముమ్మరం చేశారు. రెండున్నర గంటల పాటు సోమిరెడ్డిని విచారించారు సి.బి.ఐ. అధికారులు. పలు.ప్రశ్నలు సంధించారు అధికారులు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చానన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Read Also: Microsoft Down: మైక్రోసాఫ్ట్ డౌన్..భారత్‌లోనూ సేవలకు అంతరాయం

అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు కోర్టులో చోరీ కేసులో161 స్టేట్ మెంట్ తీసుకున్నారు. పూర్తి వివరాలు చెప్పాను. పరువు నష్టం కేసుకి సంబంధించిసివిల్..క్రిమినల్ కేసుల్లో మంత్రి కాకాణికి శిక్ష తప్పదన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను శత్రువులుగా కాకాణి చూస్తున్నారు. కాకాణి మీద నకిలీ మద్యం…నకిలీ పత్రాలు..మార్ఫింగ్…భూ వివాదం కేసులు ఉన్నారు. గతంలో చాలా మంది రాజకీయ నేతలతో పోరాడాం.

అంతేగాని ఎవరి వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా మేం చేయలేదు. నెల్లూరు రాజకీయ చరిత్రలో కాకాణి మాత్రమే ఇలాచేశారు. మొదటి సారి నెల్లూరుకు సి.బి.ఐ. వచ్చింది. కోర్టు సిబ్బందితో పాటు సంబంధం ఉన్న వారిని విచారిస్తున్నారు. కాకాణి ని కూడా సి.బి.ఐ. అధికారులు విచారిస్తారు. అవసరమనిపిస్తే నన్ను మళ్లీ పిలుస్తామన్నారు.. వాళ్ళు పిలిస్తే వెళ్ళి సమాధానం ఇస్తామన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Read Also: Siraj: నెంబర్‌వన్ బౌలర్‌గా సిరాజ్..ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ జోరు

Exit mobile version