Site icon NTV Telugu

Somireddy Chandramohan Reddy : చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

Somireddy Chandramohan Redd

Somireddy Chandramohan Redd

గతంలో ఆంధ్ర.. తెలంగాణ ముఖ్యమంత్రులు ప్యాలెస్.. ఫామ్ హౌస్ లకే పరిమితమయ్యారని, కానీ చంద్రబాబు.. రేవంత్ రెడ్డిలు ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సమావేశమయ్యారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి కాకాని వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సోమిరెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని ఆ రంగానికి ఏమీ చేయలేదని, మైక్రో ఇరిగేషన్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయలేకపోయారన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.

జగన్ ఒక నియంతలాగా వ్యవహరించారని, ఆయన హయాం కర్ఫ్యూ ని తలపించిందన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. వైసీపీ హయాంలో తిరుమల ను బ్రష్టు పట్టించారని, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయ పవిత్రతను దెబ్బతీశారన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో కాకాని కారు పాస్ దొరికిందని, వైసీపీ హయాంలో రాష్ట్రం డ్రగ్స్..గంజాయి కి కేంద్రంగా మారిందని, కల్తీ మద్యం.. నకిలీ పత్రాలలో మాజీ మంత్రి కాకాణి నిందితుడన్నారు. గ్రావెల్.. మట్టి.. తెల్ల రాయి.. లలో అక్రమ రవాణాకు పాల్పడ్డారని, టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టించి హింసించారని సోమిరెడ్డి అన్నారు. కాకాణి అవకతవకలకు సహకరించిన అధికారులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు.. ఇంకా అవుతారని, కాకాని అక్రమాలు..అవినీతిపై విచారణ చేయిస్తామన్నారు సోమిరెడ్డి.

 

Exit mobile version