Site icon NTV Telugu

Somireddy Chandra Mohan Reddy : ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తూ దోపిడీ చేస్తున్నారు..

Somireddy

Somireddy

నెల్లూరు జిల్లాలో జలవనరుల శాఖలో వందల కోట్లు మేర అవినీతి జరిగిందన్నారు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 300 కోట్ల నిధులను పనులు చేయకుండానే డ్రా చేశారన్నారు. సెంట్రల్ డివిజన్ నుండి పనులను శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. హెడ్ రెగ్యులేటర్.. ..షటర్స్ పనులను ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం లేదని సోమిరెడ్డి తెలిపారు. పనులు జరగకుండానే డబ్బులు డ్రా చేశారని, ఒక్క రాయి నాటకుండా.. ట్రెంచ్ తీయకుండా,. కాలువల్లో పార పెట్టకుండా డబ్బులు డ్రా చేశారన్నారు.

 
Anchor Pradeep: ప్రదీప్ ఏంటి ఇలా మారిపోయాడు..? న్యూ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
 

ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తూ దోపిడీ చేస్తున్నారని, కాంట్రాక్టర్లు అయిన శ్రీధర్, నిరంజన్ లు ఇద్దరూ మంత్రి కాకణికి బినామీలు అని ఆయన విమర్శించారు. అధికారులకు అన్ని వివరాలు ఇచ్చిన ఇంతవరకూ స్పందించలేదని, జిల్లాలో జరిగిన అవినీతి లెక్క తేలాలన్నారు. మంత్రి కాకణి నియోజకవర్గంలొ అవినీతికి హద్దు లేకుండా పోయిందని సోమిరెడ్డి మండపడ్డారు ముఖ్యమంత్రికి జిల్లాలో జరిగే అవినీతి, దోపిడీల్లో షేర్ ఎంతో చెప్పాలని, రాబోయే టిడిపి ప్రభుత్వంలొ ప్రత్యేక కమిటీలు వేయించి దోపిడీ చేసిన వారిని ఊచలు లెక్కపెట్టిస్తామన్నారు.

Manohar Lal Khattar: మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. సాయంత్రం ప్రమాణ స్వీకారం..

Exit mobile version