NTV Telugu Site icon

Somireddy: కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ను పూర్తిగా మూసివేస్తున్నారు..

Kakani Vs Somireddy

Kakani Vs Somireddy

కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను పూర్తిగా మూసివేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. కాకినాడ, విశాఖపట్నం, మూలపేట, ఎన్నోర్ పోర్టులకు సంబంధించి ఎన్ని వెజల్స్ వస్తున్నాయనే విషయంపై షెడ్యూల్ వచ్చిందని తెలిపారు. కృష్ణపట్నంకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడకు కంటైనర్లు వచ్చే అవకాశం లేదు.. కాబట్టి షెడ్యూల్ రాలేదని ఆరోపించారు. మంత్రి కాకాణి ఈ విషయంలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also: YSRCP: పొత్తులపై వైసీపీ మంత్రులు హాట్ కామెంట్స్..

కంటైనర్ టర్మినల్ ను తొలగిస్తే కాకాణి రాజీనామా చేస్తానని చెప్పారని సోమిరెడ్డి తెలిపారు. గతంలో బండేపల్లి, డేగపూడి కాలువ పనులకు సంబంధించి కూడా ఇలానే మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆందోళన చేస్తే హడావిడిగా ఖాళీ కంటైనర్లతో ఒక వెజల్ ను తెప్పించారని.. దాన్ని చూపించి మంత్రి కాకాని హంగామా చేశారని పేర్కొన్నారు. ఈ ఖాళీ కంటైనర్లను తీసుకెళ్లడానికి ఈనెల 12న మరో వెజల్స్ రానుందని తెలిపారు.

Read Also: Kubera: కుబేర స్టోరీ ఇదే.. అదిరిపోయింది కదా.. ?

పోర్ట్ అధికారులు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు.. కాకాని అనుచరులు టోల్ గేట్లు పెట్టి అక్రమ వసూళ్ళు చేస్తుండడం వల్లే కంటైనర్ టెర్మినల్ ను ఇక్కడ నుంచి తొలగించారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ విషయం పై ఆందోళన కొనసాగిస్తామని ఆయన తెలిపారు.