Live in-Relationship: ప్రియుడు CRPF కానిస్టేబుల్, ప్రియురాలు ASI.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ..
- ప్రియుడు CRPF కానిస్టేబుల్, ప్రియురాలు ASI
- 2021 నుంచి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమవ్యవహారాలు, లివి ఇన్ రిలేషన్ షిప్స్ కారణంగా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది. ప్రియుడు సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్, ప్రియురాలు ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ప్రియురాలి హత్యకు దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఒక మహిళా పోలీసు అధికారిణిని ఆమె ప్రియుడైన CRPF కానిస్టేబుల్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు దిలీప్ డాంగ్చియా, బాధితురాలు విధులు నిర్వహిస్తున్న అంజార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.
Also Read:Lal Darwaza Bonalu: నేడే లాల్ దర్వాజా బోనాలు.. ధూం ధాం కి సిద్ధమైన పట్నం పోరగాళ్లు
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
అరుణాబెన్ నతుభాయ్ జాదవ్ అనే ఆ మహిళ కచ్‌లోని అంజార్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI)గా పనిచేసింది. 25 ఏళ్ల అరుణాబెన్, ఆమె భాగస్వామి అంజార్‌లోని వారి ఇంట్లో గొడవ పడ్డారని, ఆ సమయంలో ఆమె అతని తల్లి గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని పోలీసులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన దిలీప్ క్షణికావేశంతో అరుణాబెన్‌ను గొంతు నులిమి చంపేశాడని అంజార్ డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డివైఎస్పీ) ముఖేష్ చౌదరి తెలిపారు.
Also Read:Delta Airlines: గాల్లో ఉండగానే ఇంజిన్ లో మంటలు.. విమానంలో 294 ప్రయాణికులు.. చివరకు(వీడియో)
మణిపూర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో విధులు నిర్వహిస్తున్న నిందితుడికి అరుణతో చాలా కాలంగా సంబంధం ఉందని, ఇద్దరూ వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారు 2021 నుంచి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పరచుకుని, అప్పటి నుంచి కలిసి జీవిస్తున్నారు అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!