Site icon NTV Telugu

Chinnu Pappu: అనుమానాస్పద స్థితిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య!

Chinnu Pappu

Chinnu Pappu

Chinnu Pappu: ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చిన్ను పప్పు (Chinnu Pappu) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. 24 ఏళ్ల చిన్ను పప్పు అసలు పేరు ‘రేష్మ’. కాసర్కోడ్ నగర సమీపంలోని ఒక అద్దె క్వార్టర్స్‌ లో ఆమె శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

IND vs PAK: దెబ్బ అదుర్స్ కదూ.. PCB డిమాండ్లను తిరస్కరించిన ICC! భారత్-పాక్ మ్యాచ్ ఇక లేనట్టే!

ఆదూర్ ప్రాంతానికి చెందిన రేష్మ.. గత కొంతకాలంగా కాసర్కోడ్ నగరానికి సమీపంలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తుంది. సోమవారం మధ్యాహ్నం ఆమె తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌ కు వేలాడుతూ కనిపించింది. దీనితో వెంటనే అక్కడి వారు ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గంగాధరన్, శైలజ దంపతుల కుమార్తె రేష్మ. ఇకపోతే ‘చిన్ను పప్పు’గా సోషల్ మీడియాలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Best Veg Protein Diet : కేవలం 10 నిమిషాల్లో ‘High Protein’ రాజ్మా సలాడ్.. మజిల్ పెరగడం పక్కా.!

కాసర్కోడ్ స్థానిక భాషా మాండలికంలో ఆమె చేసే వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. స్థానిక వంటకాలు, భోజనం, ఆ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా ఆమె చేసే వీడియోలు వైరల్ అయ్యేవి. లక్షలాది మంది నెటిజన్లు ఆమె వీడియోలను వీక్షించేవారు. రేష్మ మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, పోలీసులు ప్రాథమికంగా సేకరించిన సమాచారం ప్రకారం.. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కేవలం నెల రోజుల క్రితమే ఆమె విడాకులు తీసుకున్నట్లు సమాచారం. విడాకుల అనంతరం తలెత్తిన మనస్తాపం లేదా వ్యక్తిగత కారణాలేమైనా ఈ ఆత్మహత్యకు దారితీశాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆదూర్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.

Exit mobile version