Site icon NTV Telugu

Leopard Poachers Arrested: వేటగాళ్లను పట్టిచ్చిన సోషల్ మీడియా..

Leopard Poaching

Leopard Poaching

Leopard Poachers Arrested: మహానందిలో చిరుతపులిని చంపిన కేసులో ఏడుగురిని అటవీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ.. నిందితులను అరెస్ట్ చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఫ్యాషన్, సెంటిమెంట్ కోసం టాటూ సెంటర్ యజమాని ప్రణవ్ కుమార్ పులి పంజా లాకెట్ వేసుకున్నాడని, ఆ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు.

READ ALSO: Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్‌లో టెన్షన్ టెన్షన్..

సోషల్ మీడియాలో ప్రణవ్ చేసిన పోస్టింగ్ ఆధారంగా ఆయన టాటూ సెంటర్‌పై పోలీస్ అధికారులతో కలిసి దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రణవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చిరుతపులిని వేటాడిన ఐదుగురు వేటగాళ్ల గుట్టు బయటపడినట్లు వెల్లడించారు. మహానంది క్షేత్రం సమీపంలోని 2023 లో జినశంకర తపోవనం వద్ద మూడేళ్ల క్రితం వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఉచ్చును పెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒక చిరుతపులి ఉచ్చులో చిక్కుకుని విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు చెప్పారు. ఆ తర్వాత వేటగాళ్లు చిరుతను కాల్చి, గోర్లను అమ్ముకున్నట్లు వెల్లడించారు. వేటగాళ్లకు అటవీశాఖ వాచ్ మెన్ శేషు సహరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రణవ్ కుమార్ , శేషులతో పాటు ఐరుగురు వేటగాళ్లను అరెస్ట్ చేసి , 5 పులి గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

READ ALSO: KGB కథ తెలుసా.. ఈ ఏజెంట్ ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు..

Exit mobile version