Site icon NTV Telugu

Sobhita Dhulipala: నువ్వు దానికి కూడా పనికి రావు అన్నారు..

Sobitha

Sobitha

Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల.. అచ్చ తెలుగందం. అయితే తెలుగువారికి పరిచయమవ్వడానికే కొద్దిగా లేట్ అయ్యింది. మొదట బాలీవుడ్ లో అడుగుపెట్టి.. గూఢచారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాల కన్నా ఈ మధ్య శోభిత.. నాగచైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్ వలనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఇక ఈ మధ్యనే ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన ఈ భామ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను బయటపెట్టింది. అందరి హీరోయిన్ల లానే మొదటి ఆమె ముఖాన్ని బాగోలేదని.. హీరోయిన్ అయ్యే ముఖమేనా నీది అని అడిగారని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా మోడల్ గా వర్క్ చేసేటప్పుడు ఒక చేదు సంఘటన జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది.

Malavika Mohanan: బ్రా లేకుండా ఏంటా చూపించడం.. మల్లు బ్యూటీ

” నేను మోడల్ గా పనిచేస్తున్న రోజుల్లో ఒక కంపెనీకి యాడ్ చేయడానికి వెళ్ళాను. నన్ను చూసి నువ్వు అందంగా లేవని ముఖం మీదనే చెప్పేశారు. నేను కూడా అవును నేను అందంగా లేను అని చెప్పి వచ్చేశాను. ఆ తరువాత నా 20 ఏళ్ళ వయస్సులో ఒక షాంపూ కంపెనీకి యాడ్ చేయడానికి వెళ్లాను.. వాళ్ళు అయితే నేను ఆశలు బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరాను అని అన్నారు. కొంతకాలం తరువాత అదే కంపెనీ వారు నన్ను పిలిచి.. వారి షాంపూ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం శోభిత బాలీవుడ్ పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది.

Exit mobile version