Bathing Soaps: సబ్బు.. మనం ప్రతిరోజు వాడే వాటిలో ఇది కూడా ప్రధానంగా చేరింది. కొన్ని వందల సంవత్సరాలకు పైగా సబ్బును ఉపయోగిస్తున్నారు ప్రజలు. కానీ ప్రస్తుత రోజుల్లో ఈ సబ్బులు మురికిని తొలగించడమే కాకుండా.. ఎక్కువ హాని కూడా చేస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సబ్బు చరిత్ర చూస్తే.. క్రీ.పూ. 2800 నాటి బాబిలోనియన్లు జంతువుల కొవ్వు, కలప బూడిదతో సబ్బును తయారు చేశారు. దీనిని ఎక్కువగా బట్టలు ఉతకడానికి ఉపయోగించారు. ఆ తర్వాత క్రీ.పూ. 1500 నాటికి ఈజిప్షియన్లు చర్మ సంరక్షణ కోసం నూనెలు, ఉప్పుతో సబ్బును శుద్ధి చేశారు. ఆ తర్వాత యూరోపియన్లు స్నానం కోసం ఆలివ్ ఆయిల్‌తో సువాసన గల సబ్బులను తయారు చేశారు. ఇలా సబ్బు మనిషి అవసరాలు అతగ్గట్టుగా మారుస్తూ వచ్చారు.
Byreddy Siddharth Reddy: కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు ఉంటాయని తెలుసు..
అయితే, ప్రస్తుత సబ్బుల్లో హానికరమైన రసాయనాలు ఉంటున్నాయి. సోడియం లారిల్ సల్ఫేట్, సోడియం లారెత్ సల్ఫేట్ లు ఉన్న వాటిలో.. ఆ సబ్బు మంచి నురుగుని ఇస్తాయి. కానీ, చర్మం నుండి సహజ నూనెలను తొలగించి, చర్మం పొడిగా మారడానికి మరియు చికాకుకు కారణమవుతాయి. అలాగే పారాబెన్స్ అనే కెమికల్ వల్ల ఇవి థైరాయిడ్ హార్మోన్లను దెబ్బతీసి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇంకా సబ్బులో ఉండే.. ట్రైక్లోసన్ అనే రసాయనం వల్ల.. బ్యాక్టీరియాను చంపుతుంది. కానీ.. హార్మోన్ల సమతుల్యత.. పర్యావరణానికి కూడా హాని చేస్తుంది.
IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్పై కొనసాగుతున్న ఉత్కంఠ.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
అయితే వైద్యుడి సలహా మేరకు కొబ్బరి నూనె, షియా బటర్, కలబంద, తేనె వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన సబ్బులను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇవి చర్మానికి లేదా ఆరోగ్యానికి హాని చేయకుండా శుభ్రపరుస్తాయి. కాబట్టి, ముందుగా మీరు ఉపయోగించే సబ్బులో ఏముందో తెలుసుకోండి. అలా మీ చర్మం, హార్మోన్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సురక్షితమైన చర్మ సంరక్షణ కోసం నమ్మదగిన వైద్యుల సలహాను పాటించండి.
