Site icon NTV Telugu

Drugs Seized: చెన్నై ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ గుట్టురట్టు చేసిన స్నైపర్‌ డాగ్.. వీడియో వైరల్

Drugs

Drugs

Drugs Seized in Chennai Airport: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 5.35 కోట్ల రూపాయల విలువ చేసే 1,542 గ్రాముల మెథాక్వలోన్, 644 గ్రాముల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆఫ్రికా దేశమైన ఉగాండాకు చెందిన లేడీ కిలాడి వద్ద డ్రగ్స్ గుర్తించినట్లు కస్టమ్స్ బృందం వెల్లడించింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్‌ను కాటన్ బాక్స్‌లో దాచి తరలించే యత్నం చేసింది ఆ కిలాడీ లేడీ.

Ramdev Baba Posters: రామ్‌దేవ్‌ బాబాపై అసభ్యకర పోస్టర్లు.. ఇద్దరు కార్టూనిస్టులపై కేసు నమోదు

కానీ స్నైపర్‌ డాగ్‌ డ్రగ్స్ గుట్టు రట్టు చేసింది. ప్రయాణికురాలి చెక్‌-ఇన్‌ బ్యాగేజీలో స్నైపర్ డాగ్ ఓరియో డ్రగ్స్‌ను గుర్తించింది. అనంతరం అధికారులు నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

 

Exit mobile version