Chennai Customs : ఇటీవల ఎయిర్ పోర్టులన్నీ స్మగ్లింగ్ లకు అడ్డాలుగా మారుతున్నాయి. విదేశాల నుంచి బంగారం, వెండి, డ్రగ్స్ లాంటివి అక్రమంగా రవాణా చేస్తూ చాలామంది పట్టుబడిన వార్తలు విన్నాం. కానీ తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా ప్రయాణీకురాలి బ్యాగ్ చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు కంగుతిన్నారు. ఆమె లగేజీ నిండా పాములు కనిపించడంతో అధికారులు షాక్ తిన్నారు. ఆమె నుంచి అక్రమంగా తరలిస్తున్న వివిధ జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Cable railway bridge : దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధం
వివరాల్లోకి వెళితే ఓ మహిళా ప్రయాణికురాలు శుక్రవారం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి వచ్చింది. ఈ క్రమంలోనే లగేజీని చెక్ చేయగా విషయం బయటపడింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియో ఓ అధికారి పొడవాటి రాడ్‌ని ఉపయోగించి పామును బయటకు తీస్తున్నట్లు చూడవచ్చు. కొందరు నేలపై ఉన్న డబ్బాల నుండి బయటకు తీశారు. ఆ మహిళను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Pakistan vs New Zealand: క్రికెట్ చరిత్రలో అతిపెద్ద తప్పు.. ఇదే తొలిసారి!
ఈ ఘటనపై చెన్నై కస్టమ్స్ అధికారులు ట్వీట్ చేస్తూ.. “28.04.23న, కౌలాలంపూర్ నుండి ఫ్లైట్ నంబర్ AK13లో వచ్చిన ఓ మహిళను కస్టమ్స్ అడ్డగించింది. ఆమె సామాను తనిఖీ చేసి చూడగా.. అందులో 22 వివిధ జాతుల పాములు, ఒక ఊసరవెల్లి గమనించాం. వాటిని స్వాధీనం చేసుకుని.. 1962 r/w వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద కేసు ఫైల్ చేశాం” అని ట్వీట్ చేసింది.
On 28.04.23, a female pax who arrived from Kuala Lumpur by Flight No. AK13 was intercepted by Customs.
On examination of her checked-in baggage, 22 Snakes of various species and a Chameleon were found & seized under the Customs Act, 1962 r/w Wildlife Protection act, 1972 pic.twitter.com/uP5zSYyrLS— Chennai Customs (@ChennaiCustoms) April 29, 2023