Site icon NTV Telugu

Snake Gourd: పొట్లకాయ సాగులో అధిక లాభాలకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

snake gaurd

snake gaurd

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న కూరగాయాలలో పొట్లకాయ కూడా ఒకటి.. పొట్లకాయ చూడడానికి పాము లాగా కనిపించినప్పటికీ చాలా రుచికరంగా ఉంటుంది.. దాంతో పొట్లకాయకు మార్కెట్ వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో రైతులు వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.పొట్లకాయ సాగులో అధిక దిగుబడి కోసం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

పొట్లకాయ ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులో రెండు రకాలుగా ఉంటుంది.వాతావరణ పరిస్థితులను బట్టి, నేలలోని భూసారాన్ని బట్టి ఏ రకం విత్తనాలను సాగు చేసుకోవాలో ఎంచుకోవాలి.. వీటికి తేమ అవసరం.. ఇకపోతే..జనవరి రెండో వారం వరకు విత్తుకోవచ్చు.ఈ పంటను పందిరి విధానంలో సాగు చేయాలి.మొక్కల మధ్య 80 సెంటీమీటర్ల దూరం, వరుసల మధ్య రెండు మీటర్ల దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మంచి దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.

పంటకు నీటి అవసరం చాలా ఎక్కువ.పంట విత్తిన ఐదవ రోజు నుండి తేలికపాటి తడులు అందించాలి.పొట్లకాయ అభివృద్ధి దశలో ఉన్నప్పుడు నీటిని సమృద్ధిగా అందించాలి.ఈ విత్తనాలు విత్తిన పది రోజుల్లోనే మొలకలు వస్తాయి.. 30 రోజుల సమయంలో గొర్రు లేదా గుంటికతో అంతర కృషి చేపట్టాలి. ఒక సన్నని వైరు లేదా తాడుతో తీగలను పందిరి పైకి పాకే విధంగా చర్యలు తీసుకోవాలి.నీటి తడులను రాత్రిపూట కాకుండా కేవలం పగటిపూట మాత్రమే పంటకు అందించాలి.. విత్త శుద్ధి చేసుకొని వేసుకోవడం మంచిది.. ఈ పంటకు బూజు తెగులు, బూడిద తెగులు, వెర్రి తెగులు, ఆకుమచ్చ తెగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఇక పండు ఈగ, గుమ్మడి పెంకు పురుగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.పంటని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహా తీసుకొని పిచికారి మందులు ఉపయోగించాలి..

Exit mobile version