Site icon NTV Telugu

Rajasthan Video: వాషింగ్ మిషన్‌లో పాము ప్రత్యక్షం.. హడలెత్తిపోయిన కుటుంబ సభ్యులు

Snake

Snake

రాజస్థాన్‌లో ఓ పెద్ద నాగుపాము వాషింగ్ మిషన్‌లోకి దూరింది. లోపలికి దూరి హాయ్‌గా విశ్రాంతి తీసుకుంటుంది. సడన్‌గా కుటుంబ సభ్యుడు.. వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసి చూడగా పాము ప్రత్యక్షమైంది. దీంతో అతడు షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Anchor Rashmi: యాంకర్ రష్మీ ఇంట విషాదం!

రాజస్థాన్‌లోని కోటాలో నివాసం ఉంటున్న ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఎలా వచ్చిందో తెలియదు గానీ.. ఏకంగా వాషింగ్ మెషీన్‌లో తిష్టవేసింది. లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. బట్టలు వాష్ చేసేందుకు డోర్ ఓపెన్‌ చేయగా పెద్ద పాము కనిపించింది. దీంతో షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియాను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Tragedy: ఘోర ప్రమాదం.. విద్యుత్‌ తీగల రూపంలో విద్యార్థిని కబళించిన మృత్యువు

ఈ మధ్య పాములు జనావాసాల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో ఒక పెద్ద కోబ్రా ఇళ్ల మధ్యకు వచ్చి తిష్టవేసింది. అనంతరం ఫారెస్ట్ అధికారులు వచ్చి.. చాకచక్యంగా పట్టుకుని  అడవుల్లో విడిచిపెట్టారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version