Site icon NTV Telugu

Boy Killed Snake: నన్నే కాటేస్తావా..కొరికి చంపుతా.. పాముపై కోపంతో బాలుడు ఏంచేశాడంటే..

Boy Snake

Boy Snake

Boy Killed Snake: చాలామందికి పాములంటే చచ్చేంత భయం. అవి కనిపడితే చాలు ఎగిరి ఆమడదూరం పరిగెడుతుంటారు. ఎందుకంటే అవి కరిస్తే చనిపోతామని. పాము మనుషులను కాటేయడం సాధారణమే. కానీ చత్తీస్ గఢ్లోని జష్ పూర్ ప్రాంతంలో విచిత్రం చోటు చేసుకుంది. పాము కాటేసిందన్న కోపంతో దానిని వెంబడించి కొరికి చంపాడు ఓ 12ఏళ్ల బాలుడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: NCP Cheif Shard pawar hospitalized : శరద్ పవార్‎కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు

వివరాల్లోకి వెళితే జష్‌పూర్ జిల్లా పండారా పాత్ గ్రామానికి చెందిన దీపక్ రామ్ తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న అక్క వాళ్లింట్లో పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి పక్కనే ఉన్న పొదలో నుంచి నాగుపాము బయటకు వచ్చి తన చేతికి తాకింది. దానిని వదిలించుకొనే క్రమంలో దీపక్ కుడిచేతి బొటనవేలును కాటు వేసింది. నొప్పిగా ఉండటంతో పాము కాటేసిందని గుర్తించాడు. ఒక్కసారిగా కోపంతో పాము వెనుకాలేవెళ్లి దానిని పట్టుకున్నాడు. అది బుసలు కొడుతున్నా భయపడకుండా దాని తల కింద భాగంలో నోటితో కొరకగా అది చనిపోయిందని దీపక్ చెప్పాడు.

Read Also: Gujarat Cable Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 12మంది బీజేపీ ఎంపీ కుటుంబీకులు

ఇక్కడ విచిత్రమేమిటంటే.. తమ్ముడికి పాము కరిచిన విషయం తెలుసుకున్న అక్క కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యులు దీపక్ ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం దీపక్ పూర్తిగా కోలుకున్నాడు. పాము కాటేసినా విషం ప్రభావం చూపదనే మూఢనమ్మకం జష్పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉంది. ఛత్తీస్‌గఢ్‌కు చివరన ఉన్న జష్‌పూర్ జిల్లాలోని ఫర్సాబహార్ తహసీల్దార్ పరిధి ప్రాంతాలను నాగాలోక్ అని పిలుస్తారు. కింగ్ కోబ్రా వంటి చాలా విషపూరితమైన పాములు ఛత్తీష్‌గఢ్ ఒడిశా రాష్ట్రాన్ని కలిపే రాష్ట్ర హైవే వెంబడి ఉన్న తప్కారా, దాని చుట్టుపక్కల గ్రామాలలో కనిపిస్తాయి.

Exit mobile version