మాములుగా చిన్న జంతువులను పెద్ద జంతువులు వేటాడి తినడం వాటి పని. ఎందుకంటే వాటి ఆహారం కోసం ఏదొక దాన్ని చంపి తినకపోతే వాటి కడుపు నిండదు. అందుకోసమని పెద్ద జంతువులు చిన్న జంతువులను క్రూరంగా చంపి తింటాయి. అలాంటి సన్నివేశాలను మనం ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. జంతువులు ఎలా వేటాడి చంపుతాయో.. పాములు సహజంగా ఎలుకలు, క్రిములు, చిన్న చిన్న పక్షులను చంపుకుని తినడం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఓ పాము ఎలుకను ఎలా మింగేసిందో చూస్తే షాకవుతారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Rahul Gandhi: “టికెట్ టూ డిజాస్టర్”.. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీ కార్టూన్..
ఈ వీడియోలో ఓ పాము ఎయిర్ కండీషనర్ (AC) నుండి బయటకు వచ్చి ఎలుకను తీసుకెళుతున్నట్లు కనిపిస్తుంది. పాము ఎయిర్ కండీషనర్‌లోకి ఎలా లాగుతుందో చూడవచ్చు. ఎలుక తలను పాము మూతితో పట్టుకుని లోపలికి లాక్కుంటుంది. ఎలాగైనా మింగేయాలనే ఆత్రుతతో పట్టు వదలకుండా నెమ్మదిగా ఎలుకను లోపలికి తీసుకెళ్తుంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @theanimal.empire అనే ఖాతాతో పోస్ట్ చేశారు.
Read Also: Muthireddy Yadagiri Reddy: కబర్ధార్ పల్లా.. నీ డబ్బు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారు..
అయితే ఈ వీడియోను ఒకరోజు క్రితం షేర్ చేయగా.. 2 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా.. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారుడు ఏం రాశాడంటే.. ఎవరూ ఎక్కడా సురక్షితంగా లేరు. ఈ పాము కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తోందని చెప్పుకొచ్చారు.