NTV Telugu Site icon

Snake Bites : నెల రోజుల్లో ఒకే వ్యక్తిని 5 సార్లు కాటేసిన పాము.. చివరకు..

Snake Bites

Snake Bites

Snake Bites : ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌర గ్రామంలో ఓ వ్యక్తిని గడిచిన నెల రోజుల్లో ఒకే పాము ఒకే వ్యక్తిని ఐదుసార్లు కాటేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే పాము అన్నిసార్లు కాటు వేసిన ఆ వ్యక్తి అన్నిసార్లు బతకడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పాము కాటుకు గురైన వ్యక్తి మళ్లీ మళ్లీ ఎలా కోలుకుంటున్నాడని అంతుచిక్కకపోవడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పాము భయంతో ఆ యువకుడు ఉన్న ఇంటిని వదిలి వారి బంధువుల ఇంటి వద్దకు వెళ్లిన కానీ.. ఆ పాము మాత్రం అతన్ని అక్కడ కూడా వదలలేదు. ఆ ఘటనతో ఆ వ్యక్తి తోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Amazon Prime Day Sale 2024: ‘అమెజాన్‌’ ప్రైమ్‌ డే సేల్‌.. ఫ్రీ, వన్‌ డే డెలివరీ!

వికాస్ దుబే అనే వ్యక్తికి గడిచిన 30 రోజుల్లో ఐదు సార్లు పాము కాటుకు గురైనప్పటికీ అతను చికిత్స తర్వాత ప్రతిసారి కోరుకుంటున్నాడు. పాముకాటు వేసిన ప్రతిసారి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా అతనికి మరోసారి పాము కాడడంతో ప్రస్తుతం అతను ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ విషయం సంబంధించి సదరు వికాస్ దుబే వ్యక్తి తెలిపిన సమాచారం మేరకు మొదటగా.. జూన్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు మంచం మీది నుండి దిగుతుండగా తొలిసారి పాము కాటుకు గురయ్యాడు. ఆపై కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేట్ నర్సింగ్‌ హోమ్‌ కు తీసుకెళ్లారు. దాంతో అతను 2 రోజులు అక్కడే అడ్మిట్‌ అయ్యాడు. ఇక చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇది మాములు సంఘటన అని కుటుంబ సభ్యులు భావించారు.

India Pakistan Border : భారత్ లోకి ప్రవేశించేందుకు యత్నించిన పాక్ పౌరుడు.. కాల్పుల్లో హతం

ఆ తర్వాత జూన్ 10వ తేదీ రాత్రి మళ్లీ పాము వికాస్ ను కాటేసింది. దింతో అతనిని వారి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి పట్టుకెళ్లారు. ఈసారి కూడా అతను చికిత్స తర్వాత కోలుకోవడం విశేషం. అయితే పాము కాటులకు భయపడి జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు అతను. ఇకపోతే ఏడు రోజుల తర్వాత మరోసారి వారి ఇంట్లో మరోసారి పాము కాటువేయడంతో పరిస్థితి విషమించింది. దాంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. తర్వాత అదే ఆసుపత్రిలో చికిత్స పొంది మళ్లీ కోలుకున్నాడు. ఇక నాలుగోసారి పాము కాటు ముందు జరిగిన ఘటన తర్వాత నాలుగో రోజుల తరువాత మరోసారి వికాస్‌ను పాము కాటేసింది. కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుక వెళ్లగా ఆసుపత్రి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇంకేముంది మరోసారి వైద్యం చేసి బతికించేశారు. ఇక అనుమానం వచ్చి అతడిని వారి బంధువుల ఇంటికి పంపారు. అయితే అక్కడ కూడా ఆ పాము అతడిని వదలలేదు. అక్కడ మరోసారి కాటు వేయడంతో మరో సారి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.