Snake At Cricket Ground: కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తాజాగా జరిగిన తొలి వన్డేలో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాట్టింగ్ సమయంలో మైదానంలో ఏకంగా 7 అడుగుల పొడవున్న పాము ప్రత్యక్షమైంది. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. నిజానికి ఇది తొలిసారి ఏమి కాదు. శ్రీలంకలో మ్యాచ్ జరుగుతుండగా పాము ప్రత్యక్షమవడం ఇదివరకు కూడా జరిగింది. ఇదివరకు లంక ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్‌ల సమయంలో కూడా ఇలాంటి సంఘటనలు పలు మార్లు చోటుచేసుకున్నాయి. అయితే ఈసారి సైతం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి పామును ఎటువంటి ప్రమాదం లేకుండా మైదానంలో నుంచి బయటికి తీసుక వెళ్లారు. ఇక ఎవరికీ ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి వీడియో తెగ వైరల్ గా మారింది.
Read Also:IND vs ENG Test: డబుల్ సెంచరీ దిశగా గిల్.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న జడేజా..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు పథుం నిసాంకా (0), నిశాన్ మదుష్క (6) త్వరగా ఔటయ్యారు. అయితే, ఆ తర్వాత కుసాల్ మెండిస్ (45), చరిత్ అసలంక (106)ల మధ్య భారీ భాగస్వామ్యం ఏర్పరిచారు. దీంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 244 పరుగుల స్కోర్ చేసింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తాస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా, తన్జిం హసన్ షకీబ్ 3 వికెట్లు, తన్వీర్ ఇస్లాం, నజ్ముల్ హుస్సేన్ శాంటో చెరో వికెట్ తీసారు.
Read Also:RK Roja: కూటమి గెలుపుపై రోజా సంచలన వ్యాఖ్యలు.. ఈవీఎం మాయాజాలం తోడై..!
ఇక తక్కువ టార్గెట్ ను చేధించడానికి వచ్చిన బంగ్లాదేశ్ ఓపెనర్లు పర్వేజ్ హుస్సేన్ (13), తన్జిడ్ హసన్ (62) పరుగులతో రాణించారు. ఆ తర్వాత నజ్ముల్ హుస్సేన్ శాంటో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఇక్కడ అసలు మ్యాటర్ మొదలయింది. అయితే, విజయం దిశగా సాగుతున్న బంగ్లాదేశ్ 5 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి చివరకు బంగ్లాదేశ్ 167 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక 77 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇక ఈ మ్యాచ్ తో శ్రీలంక ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు కూడా నమోదు అయ్యింది. వన్డేలలో అత్యధికసార్లు ప్రత్యర్థి జట్టును ఏడు లేదా అంతకంటే తక్కువ పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కూల్చిన తొలి జట్టుగా లంక రికార్డ్ నెలకొల్పింది. ప్రత్యర్థిని ఇలా కుదేలు చేయడం లంకకు మూడోసారి.
#snake #Cricket pic.twitter.com/Y5KMfE94aZ
— ABHISHEK PANDEY (@anupandey29) July 3, 2025
