Watching TV : నేటి కాలంలో టీవీ లేని ఇళ్లు లేదంటే నమ్మశక్యంగా ఉండదు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ప్రతి ఇంట్లో ఎల్ సీడీ, ఎల్ ఈడీ టీవీలు ఉంటున్నాయి. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ గంటల తరబడి టీవీలు చూస్తూ కాలం గడిపేస్తుంటారు. చాలామందికి తినేటప్పుడు కచ్చితంగా టీవీ ఆన్ చేసి ఉండాల్సిందే. అదే పనిగా గంటల తరబడి కూర్చోవడంతో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో ఎంత సేపు టీవీ చూసిన అది చూసే సమయంలో తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువ సమయం టీవీ చూసే వాళ్లు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం.
Read Also: Bribery Case: బ్యాగు నిండా డబ్బులు.. భార్య చేసిన పనికి షాక్
ఈ రోజుల్లో చాలా మంది టీవీ చూస్తూ చిప్స్, బిస్కెట్లు, పిజ్జా వంటి వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ అవి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఎందుకంటే అవి ఆరోగ్యంతో పాటు పొట్టకూ ప్రమాదకరం. మీరు ఆరోగ్యకరమైనది తినాలనుకుంటే, టీవీ చూస్తూ డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. ఎందుకంటే ఇందులో మంచి ప్రొటీన్లు ఉంటాయి. టీవీ చూసే సమయంలో ఇది మంచి ఎంపిక. అంతే కాదు వీటిని తినడం వల్ల శక్తి కూడా లభిస్తుంది. అయితే ఉప్పు లేకుండా డ్రై ఫ్రూట్స్ తినాలి. ప్రతి ఇంట్లో పెరుగు ఉంటుంది. కాబట్టి మీరు టీవీ చూస్తున్నప్పుడు పెరుగు తినవచ్చు. మీరు దీన్ని రైతా లేదా తీపి పెరుగు రూపంలో కూడా తినవచ్చు.
Read Also: Minister KTR: నాలుగేళ్లలో ఏం చేశావ్.. బండి సంజయ్‌పై కేటీఆర్ ధ్వజం
చాలా మంది పాప్‌కార్న్ తినడానికి ఇష్టపడతారు. ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు టీవీ చూస్తూ పాప్‌కార్న్ తినవచ్చు. దీన్ని చిరుతిండిగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ రెండూ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే టీవీ లేదా మొబైల్ చూస్తున్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్లలో మీరు ద్రాక్ష, ఆపిల్ మరియు బొప్పాయి తినవచ్చు. ఇది మనల్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి.