Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
- జింబాబ్వేతో రెండో వన్డేలో స్మృతి మందాన డకౌట్
- కేవలం రెండు బంతులు ఎదుర్కొని నోమ్వెలో సిబాండా బౌలింగ్‌లో ఔట్
- డకౌట్‌తో మహిళల వన్డేల్లో భారత ఓపెనర్‌గా మందానకు 5 డకౌట్లు నమోదు
- అత్యధిక డకౌట్ల జాబితాలో మందాన మూడో స్థానానికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మందాన డకౌట్‌గా వెనుదిరిగింది. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న మందాన.. నోమ్వెలో సిబాండా బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఈ డకౌట్‌తో మందాన ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో భారత ఓపెనర్‌గా అత్యధిక డకౌట్లు ఎదుర్కొన్న ఆటగాళ్ల జాబితాలో ఆమె మూడో స్థానానికి చేరింది. ఆమె ఇప్పటివరకు 5 సార్లు డకౌట్ అయింది. ఈ జాబితాలో జయ శర్మ 9 డకౌట్లతో అగ్రస్థానంలో ఉండగా.. జెమీమా రోడ్రిగ్స్ 6 డకౌట్లతో రెండో స్థానంలో ఉంది.
మందానతో పాటు అంజు జైన్, పూనమ్ రౌత్ కూడా ఓపెనర్లుగా 5 డకౌట్లు నమోదు చేశారు. మరోవైపు అనఘా చోప్రా 4 డకౌట్లతో ఉన్నారు. దీంతో మందానకు ఈ అనవసర జాబితాలో చోటు దక్కడంతో అభిమానులను నిరాశకు ఎదురైంది. ఇకపోతే హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాత ఈ నెలలో భారత మహిళల జట్టుకు మందాన పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్ ఆమెకు కెప్టెన్‌గా తొలి పూర్తి స్థాయి అసైన్మెంట్. అయితే బ్యాటర్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.
Also Read
- Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
- Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
- All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
- Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మంధాన రెండు ఇన్నింగ్స్‌ల్లో 56 పరుగులు చేసింది. తొలి వన్డేలోనూ 34 బంతుల్లో 32 పరుగులకే పరిమితమైంది. ఇప్పుడు రెండో వన్డేలో డకౌట్ కావడంతో కెప్టెన్‌గా ఆమెపై మరింత ఒత్తిడి పెరిగినాట్లు అర్థమవుతుంది. భారత జట్టు సీనియర్ ఓపెనర్‌గా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో తర్వాతి మ్యాచ్‌ల్లో ఎలా రాణిస్తుందో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?