Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!

  • జింబాబ్వేతో రెండో వన్డేలో స్మృతి మందాన డకౌట్‌
  • కేవలం రెండు బంతులు ఎదుర్కొని నోమ్వెలో సిబాండా బౌలింగ్‌లో ఔట్
  • డకౌట్‌తో మహిళల వన్డేల్లో భారత ఓపెనర్‌గా మందానకు 5 డకౌట్లు నమోదు
  • అత్యధిక డకౌట్ల జాబితాలో మందాన మూడో స్థానానికి..
Smriti Mandhana

Smriti Mandhana

Smriti Mandhana: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మందాన డకౌట్‌గా వెనుదిరిగింది. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న మందాన.. నోమ్వెలో సిబాండా బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఈ డకౌట్‌తో మందాన ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో భారత ఓపెనర్‌గా అత్యధిక డకౌట్లు ఎదుర్కొన్న ఆటగాళ్ల జాబితాలో ఆమె మూడో స్థానానికి చేరింది. ఆమె ఇప్పటివరకు 5 సార్లు డకౌట్ అయింది. ఈ జాబితాలో జయ శర్మ 9 డకౌట్లతో అగ్రస్థానంలో ఉండగా.. జెమీమా రోడ్రిగ్స్ 6 డకౌట్లతో రెండో స్థానంలో ఉంది.

మందానతో పాటు అంజు జైన్, పూనమ్ రౌత్ కూడా ఓపెనర్లుగా 5 డకౌట్లు నమోదు చేశారు. మరోవైపు అనఘా చోప్రా 4 డకౌట్లతో ఉన్నారు. దీంతో మందానకు ఈ అనవసర జాబితాలో చోటు దక్కడంతో అభిమానులను నిరాశకు ఎదురైంది. ఇకపోతే హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాత ఈ నెలలో భారత మహిళల జట్టుకు మందాన పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్ ఆమెకు కెప్టెన్‌గా తొలి పూర్తి స్థాయి అసైన్‌మెంట్. అయితే బ్యాటర్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.

జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మంధాన రెండు ఇన్నింగ్స్‌ల్లో 56 పరుగులు చేసింది. తొలి వన్డేలోనూ 34 బంతుల్లో 32 పరుగులకే పరిమితమైంది. ఇప్పుడు రెండో వన్డేలో డకౌట్ కావడంతో కెప్టెన్‌గా ఆమెపై మరింత ఒత్తిడి పెరిగినాట్లు అర్థమవుతుంది. భారత జట్టు సీనియర్ ఓపెనర్‌గా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో తర్వాతి మ్యాచ్‌ల్లో ఎలా రాణిస్తుందో ఆసక్తికరంగా మారింది.