Site icon NTV Telugu

Smriti Mandhana: పలాష్ ముచ్చల్‌ మామూలోడు కాదుగా.. సినిమాటిక్ స్టైల్ లో లవ్ ప్రపోజల్..!

Smriti Mandhana

Smriti Mandhana

Smriti Mandhana: టీమిండియా స్టార్ క్రికెటర్, ఇటీవల ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యులలో ఒక్కటైన స్మృతి మంధాన (Smriti Mandhana) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) ఆమె వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు పలాష్ ఆమెకు ప్రపోజ్ చేసిన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో సినిమాటిక్ ప్రపోజల్ ఈ జంటకు సంబంధించిన ఓ రొమాంటిక్ వీడియోను పలాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం (DY Patil Stadium) వేదికగా ఈ అపురూప ఘట్టం చోటుచేసుకుంది.

Tata Motors Offer: నెవర్ బిఫోర్.. టాటా కార్లపై రూ.1.75 లక్షల వరకు భారీ డిస్కౌంట్..!

వైరల్ గా మారిన వీడియోలో మొదట పలాష్, స్మృతిని కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యలోకి తీసుకురావడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమెకు ఉన్న గంతలు విప్పగానే పలాష్ మోకాళ్లపై కూర్చొని చేతిలో ఎర్ర గులాబీల బొకే, డైమండ్ రింగ్‌తో ఆమెకు ప్రపోజ్ చేశారు. ఇంకేముంది.. ఈ ఊహించని సర్ ప్రైజ్‌తో స్మృతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పలాష్ వేలికి ఆమె ఉంగరాన్ని తొడిగారు. చివరికి ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్ రింగ్స్ చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

Betting Apps Case: నేడు విచారణకు హాజరు కానున్న..హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి

ఇదే స్టేడియంలో కొద్ది రోజుల క్రితం స్మృతి మంధాన వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వేదికపై తన జీవిత భాగస్వామి నుంచి ప్రపోజల్ అందుకోవడం విశేషం. వీరిద్దరూ నవంబర్ 23న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ జంటకు ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలిపారు.

Exit mobile version