Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన తన వివాహానికి సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించింది. ఆమె చేసిన ఈ పని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఆమె చర్యలపై ప్రజలు వివిధ రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవానికి స్మృతి మంధాన తన ప్రియుడు పాలక్ ముచ్చల్‌ను నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చి, వివాహం నిరవధికంగా వాయిదా పడింది.
READ ALSO: iPhone 16: ఇది కదా బంపరాఫర్ అంటే.. సగం ధరకే ఐఫోన్..
ఆమె తండ్రి ఆస్పత్రిలో చేరిన తర్వాత, ఆమెకు కాబోయే భర్త పలాష్ కూడా అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఆయనను వైద్యులు పరీక్షించిన తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. ఇదే సమయంలో స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తనకు పలాష్ చేసిన ప్రపోజల్ వీడియోను తొలగించింది. అలాగే జెమిమా రోడ్రిగ్జ్, శ్రేయంకా పాటిల్ వంటి స్మృతి సన్నిహితులు, సహచరులు కూడా వారి వారి ఖాతాల నుంచి ఈ వీడియోను తొలగించారు. భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ వివాహం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. స్మృతి, పలాష్ వివాహం నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో జరగాల్సి ఉంది. వివాహానికి ముందు సంగీత్, హల్ది వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలకు మహిళా ప్రపంచ కప్ విజేత భారత క్రికెట్ జట్టు సభ్యులు పలువురు హాజరయ్యారు. ఏది ఏమైనా స్మృతి మంధాన తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తన ప్రపోజల్ వీడియోను తొలగించడం కొత్త అనుమానాలకు, ఊహాగానాలకు అవకాశం కల్పించినట్లు అయ్యిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Afghanistan – India: భారత్‌కు ఆఫ్ఘన్ బంగారం లాంటి ఆఫర్..
