NTV Telugu Site icon

Smriti Mandhana: రికార్డు బ్రేక్.. ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా స్మృతి

Smriti Mandhana (1)

Smriti Mandhana (1)

Smriti Mandhana: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన మరోమారు సెంచరీతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్స్ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదురుకొని భారీ స్కోరును సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అన్నాబెల్ సదర్లాండ్ సెంచరీ కారణంగా ఆరు వికెట్లకు 298 పరుగులు చేసింది. మరోవైపు, అరుంధతి రెడ్డి భారత్‌ తరఫున అద్భుతంగా రాణించి 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మొదట్లో 78 పరుగులకే తొలి 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సదర్లాండ్ 95 బంతుల్లో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించింది.

Also Read: AUS W vs IND W: స్మృతి మందాన సెంచరీ చేసినా.. భారీ తేడాతో ఓడిన భారత్

ఇక భారీ లక్ష్య ఛేదనలో ప్రతిగా స్మృతి మంధాన జట్టుకు శుభారంభం అందించి ఏడాదిలో నాలుగో సెంచరీ సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 103 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది. ఈ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. అయితే, సెంచరీ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక 105 పరుగులు చేసి ఔటైంది. ఇకపోతే, 2024లో ఆమెకు నాలుగో వన్డే సెంచరీ. దీంతో మహిళా క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రీడాకారిణిగా కూడా స్మృతి మంధాన నిలిచింది. మహిళల వన్డే క్రికెట్‌లో 7 మంది క్రీడాకారిణులు ఏడాది వ్యవధిలో అత్యధికంగా 3 సెంచరీలు మాత్రమే సాధించారు. కానీ, స్మృతి మంధాన 4 సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్ గా రికార్డ్ సృష్టించింది.

Also Read: Hardik Pandya: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అథ్లెట్‌ లిస్టులో టీమిండియా ఆల్‌రౌండర్

ఈ ఇన్నింగ్స్‌తో స్మృతి మంధాన తన వన్డే కెరీర్‌లో 9 సెంచరీలు పూర్తి చేసుకుంది. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా స్మృతినే. మరోవైపు, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. స్మృతి మంధానతో పాటు నాట్ స్కివర్ బ్రంట్, షార్లెట్ ఎడ్వర్డ్స్, చమరి అటపట్టు కూడా వన్డే క్రికెట్‌లో 9 సెంచరీలు చేశారు. అదే సమయంలో, మెగ్ లానింగ్ 15 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్ 13 సెంచరీలతో, ఇంగ్లాండ్ కు చెందిన టామీ బ్యూమాంట్ 10 సెంచరీలతో.. వరుసగా రెండు మూడు స్థానాలలో ఉన్నారు.